లబ్ధిదారుల డబ్బులు గుత్తేదారు కాజేశారు

0

అక్షరటుడే, బాన్సువాడ: కోటగిరి మండలం ఎత్తుండ గ్రామంలో 66 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు గుత్తేదారు కాజేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.55 లక్షల నిధులను గుత్తేదారు కొయ్యగుట్ట శ్రీధర్ ఇప్పటివరకు లబ్ధిదారులకు చెల్లించలేదని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గుత్తేదారులు డబ్బులు చెల్లించలేదని, విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.