అక్షరటుడే, నిజామాబాద్ నగరం: జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ నెల 16న నగరానికి రానున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణు తెలిపారు. బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహేష్ కుమార్ ఎమ్మెల్సీగా, షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి నిజామాబాద్ కు వస్తున్నందున భారీ స్వాగత ర్యాలీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రగతినగర్ మున్నూరు కాపు సంఘంలో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నరాల రత్నాకర్, జావిద్ అక్రం, శేఖర్ గౌడ్, దయాకర్ గౌడ్, రాంభూపాల్, అంతిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, గంగారెడ్డి, మధుసూధన్ పాల్గొన్నారు.