అక్షరటుడే ఆర్మూర్ : వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బుధవారం 117 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో రైతువేదికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి మీరిచ్చారా అంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement