అక్షరటుడే, నిజామాబాద్: జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్ రజిత యాదవ్ కాంగ్రెస్ లో చేరారు. గురువారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం గురువారం ఉదయమే షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ లోనూ వినయ్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగాయి. ఒకే రోజు జిల్లాకు చెందిన పలువురు గులాబీ నాయకులు హస్తం పార్టీలో చేరడంపై చర్చ జరుగుతోంది.