అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్ రావడంతో పాటు యూనివర్సిటీ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వచ్చాయని కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ యాదగిరి నుంచి గురువారం సంబంధిత ఉత్తర్వులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.