అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచినట్లు నగర సీఐ శ్రీనివాసరాజు తెలిపారు. నగరంలోని రెండో టౌన్ పరిధిలో గల రౌడీషీటర్లకు గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పండుగలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.