అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్ల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేయగా.. షాద్‌నగర్‌లోని కొందుర్గ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఐదువేల స్కూళ్లను మూసివేసిందని పేర్కొన్నారు. కానీ తాము మెరుగైన ప్రమాణాలతో విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకే ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారభించనున్నామని పేర్కొన్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒకేచోట చదువుకునే విధంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అన్ని తెలిసిన బీఆర్‌ఎస్‌ నాయకుడు మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను తప్పుపట్టడం సరికాదన్నారు. అలాగే 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని చెప్పారు.