అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : ప్లాట్లను గడువులోపు రెగ్యులరైజ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. దోమకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే ఫ్రైడే డ్రైడే కార్యక్రమ పనులను తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.