అక్షర టుడే, ఆర్మూర్ : మాక్లూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్‌రావు, నందిపేట మండలానికి చెందిన పెంట ఇంద్రుడు నిజామాబాద్ ఏఎంసీ డైరెక్టర్లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆదివారం స్థానిక పీవీఆర్ భవన్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి పి వినయ్‌కుమార్‌రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, పండిత్, పవన్, తదితరులు పాల్గొన్నారు.