అక్షరటుడే, ఇందూరు : హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చాలనే నిర్ణయంపై ఆర్యవైశ్యులు పోరాడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. గణపతి, దేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా నగరంలోని ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చేది పొట్టి శ్రీరాములు పేరన్నారు. కార్యక్రమంలో టీఆర్పీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రశేఖర్, గజవాడ శ్రీనివాస్, ధన్‌పాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు పేరు మార్పును అడ్డుకోవాలి
Advertisement
Advertisement