అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు అమ్రాపాలి, రోనాల్ట్‌ రోస్‌, వాకాటి కరుణ, సృజన సోమవారం క్యాట్‌ను ఆశ్రయించారు. మొదట సీఎస్‌ శాంతి కుమారితో వీరు భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణలోనే కొనసాగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వారు క్యాట్‌కు అప్పీల్‌ చేశారు. తెలంగాణలో విధుల్లో ఉన్న ఏపీ క్యాడర్ఐ ఏఎస్‌లు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.