అక్షరటుడే, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తిరుమల దర్శనాలపై పడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులకు వసతి, దర్శనం, భోజనం, ప్రసాద పంపిణీలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు. గాట్ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జేసీబీలు, అంబులెన్సులు, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Advertisement
Advertisement