అక్షరటుడే, బాసర: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ ఛార్జి వీసీగా జేఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్ధన్ నియామితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ ఛార్జి వీసీగా కొనసాగుతున్న వెంకటరమణపై పలు ఆరోపణలు రావడంతో వీసీ బాధ్యతల నుంచి తప్పించారు.