అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభ పక్ష భేటీలో ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ హాజరయ్యారు. కొత్త సీఎంగా ఎన్నికైన సైనీకి వీరు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా సైనీ గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.