అక్షరటుడే, కామారెడ్డి: భిక్కనూరు మండలం బస్వాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఆరాతీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో సరదాగా మాట్లాడారు.