అక్షరటుడే, ఇందూరు : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల అంశంపై మద్దతు ఇవ్వాలని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ నాయకులు బుధవారం జిల్లాకేంద్రానికి వచ్చిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను కలిసి విన్నవించారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల సంఘం సమన్వయకర్త నరాల సుధాకర్, సుజన్, బాలకృష్ణ, శ్రీనివాస్, దత్తు, సందేశ్ తదితరులు పాల్గొన్నారు.