అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ నుంచి ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌రోస్‌, అమ్రపాలి రిలీవ్‌ అయ్యారు. ఈ అధికారుల స్థానాల్లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్వీకర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినా, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, ఎనర్జీ సెక్రటెరీగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, టూరిజం అండ్‌ కల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటెరీగా శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ ఐఏఎస్‌ అధికారులు ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఇవాళే ఆఖరు తేదీ కావడం గమనార్హం. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌, హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. కాగా ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు.