అక్షరటుడే, బాన్సువాడ : ఎంపీడీవో కార్యాలయానికి అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేసిన ఘటన గురువారం మధ్యాహ్నం చందూర్లో జరిగింది. చందూర్ ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. 26 నెలలుగా భవనానికి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని గురువారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశారు. అద్దె బకాయిలు చెల్లించే వరకు కార్యాలయానికి తాళం తీయనని భీష్మించుకుని కూర్చున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయానికి తాళం తీశారు.