అక్షరటుడే, కామారెడ్డి: పదోన్నతులు కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రిన్సిపాల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నియామకమైన రెగ్యులర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తమకు అర్హతలు ఉన్నా పదోన్నతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీయూటీఏ ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు, అధ్యాపకులు అంజయ్య, హరిత, నాగరాజు, ప్రతిజ్ఞ పాల్గొన్నారు.