అక్షరటుడే, ఎల్లారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గాంధారి మండలం సీతయ్యపల్లిలో గురువారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ధాన్యం తడిసి పోకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, డీఏవో తిరుమల ప్రసాద్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bhu Bharati | 17 నుంచి భూభారతి అవగాహన సదస్సులు