అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియామకమైన అధ్యాపకులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు పదోన్నతులు కల్పించాలని టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన యూనివర్సిటీలో తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చినందున వెంటనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వర్ కార్యదర్శులు బాలకిషన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement