అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : రైలు కింద పడి ప్రేమ జంట శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్ద చోటుచేసుకుంది. కాగా మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌(22), నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన శైలజ(21)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.