అక్షరటుడే, బాన్సువాడ: కొడుకును వాగులో తోసేసిన ఘటనలో తండ్రి ట్విస్ట్‌ ఇచ్చాడు. కొడుకును బంధువుల ఇంట్లో సురక్షితంగా ఉంచినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దేశాయిపేట్‌ గ్రామానికి చెందిన దంపతులు రాములు, గంగామణి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో భార్యను భయపట్టేందుకు వాగులో తోసేసినట్లు గురువారం సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రాములును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో బాలుడిని వాగులో తోసేయలేదని, బంధువుల ఇంట్లో దాచానని చెప్పినట్లు సీఐ అశోక్‌ తెలిపారు.