అక్షరటుడే, కామారెడ్డి/కామారెడ్డి గ్రామీణం: రైతుబంధును వెంటనే రైతుల ఖాతాల్లోకి వేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో, రాజంపేట, దోమకొండ మండల కేంద్రాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిష్టిబొమ్మలను నాయకులు దహనం చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, రాజంపేట, దోమకొండ మండల బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement

Advertisement