కుల గణనతోనే వర్గీకరణ సాధ్యం

0

అక్షరటుడే, ఇందూరు: కుల గణనతోనే ఎస్సీ వర్గీకరణతో పాటు అన్ని కులాల సమస్యలు పరిష్కారమవుతాయని మాదిగ కుల సంఘాల చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. మాదిగల జోడోయాత్రలో భాగంగా గురువారం ఆయన నిజామాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల గణన చేయకుండా కేంద్రం అడ్డుపడుతుందన్నారు. బీజేపీ మాయమాటలు చెప్పి ఎస్సీ ఓట్ల ద్వారా ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ సీట్లు గెలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు శ్రీనివాస్‌, శివ, గోవర్ధన్‌, మహేందర్‌, శివకుమార్‌, బాబురావు, యాదయ్య, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.