అక్షరటుడే, వెబ్డెస్క్: విధి నిర్వహణలో అమరులైన ఏఎస్సై, కానిస్టేబుళ్లకు రూ. కోటి పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరులైన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అమరులైన కానిస్టేబుల్, ఏఎస్సై కుటుంబాలకు రూ. కోటి పరిహారం, ఎస్సై, సీఐ కుటుంబాలకు రూ. కోటి 25 లక్షలు అందిస్తామన్నారు. డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటి 50 లక్షలు ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ. రెండు కోట్ల పరిహారం ఇస్తామన్నారు.