అక్షరటుడే, వెబ్ డెస్క్ : గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం పరీక్ష జరగనున్నందున వాయిదా వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పరీక్షలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నందున పరీక్షా ఆపడం సాధ్యం కాదని తీర్పు వెల్లడించింది.