అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేయడానికి భారత బలగాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమన్నారు.