అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల ట్రెండ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం మార్కెట్లు కాస్త లాభాలతోనే ప్రారంభమై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించినా.. 10 గంటల తర్వాత మళ్లీ నష్టాలబాట పట్టాయి. టాటా, అదానీ గ్రూప్ స్టాక్స్ తో ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రిలయన్స్, బీఈఎల్, బీపీసీఎల్, ఓఎన్జిసీ, ఎన్టీపీసీ, ఎల్టీ, కోటక్, ఎస్బీఐ వంటి స్టాక్స్ నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి.