అక్షరటుడే, నిజామాబాద్‌: నిజామాబాద్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా ఇదివరకు పనిచేసిన విష్ణుమూర్తిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా పనిచేసిన సమయంలో ఏసీపీ విష్ణుమూర్తి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. సివిల్‌ సెటిల్‌మెంట్లు చేయించారు. కాగా అప్పటి సీపీ కల్మేశ్వర్‌ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయనను తొలుత డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. పూర్తి విచారణ అనంతరం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.