అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 309, బ్యాంక్ నిఫ్టీ 705 పాయింట్లు పడిపోయాయి. పీఎస్ యూ, ఆటో స్టాక్స్ తో పాటు అదానీ, టాటా గ్రూప్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 50లో ఐసీఐసీఐ స్టాక్ మాత్రమే లాభపడింది. మిగతా స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.