అక్షరటుడే, కామారెడ్డి : ఇంటికి తాళం వేసి వెళ్లగా.. దొంగలు రాత్రికి రాత్రికి ఇల్లు గుల్ల చేసిన ఘటన కామారెడ్డిలో పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణంలోని పీఎంహెచ్ కాలనీలో 37 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. కాలనీలో నివసించే అర్నె యోగేశ్ అనే వ్యక్తి సోమవారం తన ఇంటికి తాళం వేసి వరంగల్ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం తెలుసుకుని యోగేశ్ ఆఘమేఘాల మీద ఇంటికి వచ్చి చూడగా 37 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ సిబ్బంది, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించి పాత నేరస్తుల గురించి మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.