అక్షరటుడే, వెబ్‌డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈపిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈవిషయంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.