అక్షరటుడే, జుక్కల్ : ప్రతి బూత్‌లో బీజేపీ సభ్యత్వాన్ని పెంచాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లి ఆరేపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు సభ్యత్వ నమోదు పై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాముసేటు, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు మేకల నరేష్, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ పాల్గొన్నారు.