అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్యలో శనివారం భూగర్భజల శాఖ, కార్ట్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా భూగర్భజలాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భూగర్భజలాల పెంపు, సంరక్షణ, తదితర అంశాలపై భూగర్భ శాఖ జిల్లా అధికారి సతీష్‌ యాదవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, మత్స్యశాఖ అధికారి శ్రీపతి, ఎన్జీవో ప్రతినిధి రాజు, ఎంపీడీవో నాగవర్ధన్, అధికారులు పాల్గొన్నారు.