అక్షర టుడే, ఆర్మూర్: రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై ఈనెల 29న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నామని, రైతులు, కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవారాం పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామన్నారు. జిల్లా అధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి కిషన్, రాజేశ్వర్, రాజన్న, అశోక్, బాలయ్య, రాజన్న, లింబాద్రి, గంగాధర్, కిషన్ పాల్గొన్నారు.