అక్షరటుడే, బాన్సువాడ: నాగర్ కర్నూల్‌లో నిర్వహిస్తున్న మాలల ఆత్మగౌరవ భారీ బహిరంగ సభకు బాన్సువాడ మండలం నుంచి మాల మహానాడు నాయకులు ఆదివారం తరలివెళ్లారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమలో మల్లూరి సాయిలు, వెంకటేష్, నర్సింలు, జగన్, మోహన్, ప్రశాంత్, మన్నె చిన్న సాయిలు, శివయ్య, సురేష్, సాయిలు, వినోద్, జగ్గా ఆనంద్, వెంకట్ రత్నం, గుజ్జరీ గంగారాం, విఠల్ పాల్గొన్నారు.