అక్షరటుడే, వెబ్‌డెస్క్: దైవ దర్శనానికి వెళ్లి వచ్చేలోపు అధికారులు ఇంటిని కూల్చివేశారు. హైదరాబాద్‌లోని మూసాపేట బాలాజీనగర్‌కు చెందిన నిరుపమరాణి కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి అధికారులు ఆమె ఇంటిని అక్రమ నిర్మాణం అని కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సామగ్రి మొత్తం ధ్వంసం అయిందని వాపోయారు.