అక్షరటుడే, కామారెడ్డి: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మూడు డీఏలను ప్రకటించాలని టీపీటీఫ్‌ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో టీపీటీఫ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని గత పది నెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా ఓపిక పట్టామన్నారు. డీఏతో పాటు జీవో 317 సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీపీటీఫ్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు డా.నాగభూషణం, లింగం రూప్‌ సింగ్‌, లింగం, నళినీ దేవి, లక్ష్మి, విజయశ్రీ, మీనా, భూషణ్‌ పాల్గొన్నారు.