అక్షరటుడే, కామారెడ్డి: ప్రజావాణి సందర్భంగా సోమవారం సీపీఎం నాయకులు కలెక్టరేట్ డోర్ కు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. తాము ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే మెట్ల నుంచి కిందకు దింపేసి తమను కలెక్టర్ అవమానించారని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమను అవమానించారని తెలిపారు. కలెక్టరేట్ పోలీసు సిబ్బంది వచ్చి.. కలెక్టర్ రమ్మంటున్నారని సీపీఎం నాయకులకు సర్దిచెప్పినా అందరి ముందు తమను అవమానించారని, తాము రాలేమని చెప్పడంతో సిబ్బంది వెళ్లిపోయారు. అనంతరం గేటుకు వినతిపత్రం కట్టి నిరసన తెలిపారు.