అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం వీసీ యాదగిరి రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్న యూనివర్సిటీ భూములపై న్యాయపరంగా ముందుకెళ్లాలని కోరారు. బాలికల హాస్టల్ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. విద్యార్థుల నుంచి భోజన చార్జీలు వసూలు చేయవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రిన్స్, తెయూ కార్యదర్శి జయంతి, నాయకులు రవీందర్, అక్షయ్, బిందు, ఆకాశ్ పాల్గొన్నారు.