అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలో సోమవారం సాయంత్రం పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఫ్లాగ్‌డే ను పురస్కరించుకుని ఎల్ఐసీ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్(ఏఆర్) శంకర్‌నాయక్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్మ్డ్ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, టౌన్‌సీఐ శ్రీనివాస్‌రాజ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్‌కుమార్, తిరుపతి, శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్‌పాషా, సిబ్బంది పాల్గొన్నారు.