అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థులకు వేసే భిక్ష కాదని, అది విద్యార్థుల హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్ అన్నారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాల నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాను దిగ్బంధించి ధర్నా చేపట్టారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.