అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మూసీ పునరుజ్జీవంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. నవంబర్‌ మొదటి వారంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో భాగంగా బాపురోడ్‌ ఘాట్‌ నుంచి 30 కిలోమీటర్ల మేర పనులను ప్రారంభిస్తామని వెల్లడిరచారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాగా మూసీ పునరుజ్జీవంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పనులకు రూ. 140 కోట్లతో డీపీఆర్‌ తయారీకి ఆదేశాలిచ్చామన్నారు. పునరుజ్జీవం ప్రాజెక్టుపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీపీపీ విధానం మూసీ ప్రక్షాళన చేపడతామని ఆయన చెప్పారు.