అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం రాత్రి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. వసతి గృహంలో కల్పిస్తున్న భోజన వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని విద్యను ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అలాగే విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్ రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, సహాయ సంక్షేమాధికారి వెంకటేశ్, హాస్టల్ వెల్ఫేర్ అధికారి యాదగిరి, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
Advertisement
Advertisement