Advertisement
అక్షరటుడే, బాన్సువాడ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం కొల్లూరు, దామరంచ రహదారి మధ్యలో బైక్ పై ఓ వ్యక్తి వేగంగా వెళ్తూ ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన జోగోళ్ల ప్రవీణ్ గా గుర్తించినట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Advertisement