అక్షరటుడే, కామారెడ్డి : గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా ముజీబోద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న రూ.18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపినందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంచకుండా ఈఆర్సీని ఒప్పించడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు.