అక్షరటుడే, వెబ్ డెస్క్: ‘ధరణి’ పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నారు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా మండలస్థాయిలో 2-3 కమిటీలు నియమించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరితగతిన బృందాలు దరఖాస్తులను పరిష్కరించేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు భూసంబంధిత సమస్యలకు మార్గం సుగమం కానుంది.
‘ధరణి’ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
Advertisement
Advertisement