అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఇండియాలో పర్యటించిన ఫ్రాన్స్ రాయబారి ఫోన్ చోరీకి గురైంది. ఈకేసులో నలుగురు యువకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 20న ఫ్రాన్స్ రాయబారి థిర్రీ మాథౌ తన భార్యతో కలిసి ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్‌ను సందర్శించారు. దీపావళి సందర్భంగా షాపింగ్ చేశారు. రద్దీ బజార్‌లో ఆయన ఫోన్ చోరీ అయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేసి ఫ్రెంచ్ రాయబారి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఆయనకు ఫోన్‌ను తిరిగి అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.