అక్షరటుడే, ఇందూరు: మాదకద్రవ్యాలను అరికట్టేలా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చడానికి పోలీసు, మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్యాశాఖలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ అధికారులు వినీత్ రెడ్డి, రవితేజ, వెంకటేశ్వర్లు, సులోచన, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.